విజయవాడ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి చీరల కుంభకోణం మీద విచారణ ఇవాళ జరుగుతుందని తెలుస్తోంది. రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ నియమించిన ప్రత్యే కమిటీ ఇవాళ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని సమాచారం.
2018-19 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2కోట్ల విలువైన చీరలకు సంబంధించిన లెక్కల్లో అవకతవకలు జరిగాయని అప్పటి ఎగ్జిక్యూటివ్ అధికారి సురేష్ బాబు, ఆ విభాగానికి సంబంధించిన గుమస్తా సుబ్రహ్మణ్యం మీద సస్పెన్షన్ వేటు వేసారు. సురేష్ బాబు తర్వాత ఈఓగా పనిచేసిన భ్రమరాంబ ఆ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఏఈఓ సుధారాణి విచారణాధికారిగా విచారణ పూర్తి చేసి నివేదికను రూపొందించారు. దాని ప్రకారం, లెక్కల్లో అవకతవకలు ఉన్నాయని నిర్ధారించారు. అయితే నిందితుడు సుబ్రహ్మణ్యం మాత్రం దేవస్థానానికి గతంలో ఎన్నడూ లేనంతగా రూ.5కోట్ల ఆదాయం వచ్చిందంటూ చెబుతున్నారు.
ఆ నేపథ్యంలో ప్రత్యేక కమిటీ విచారణ చేపట్టింది. ఆ కమిటీలో నలుగురు సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. సదరు కమిటీ విచారణ జరపడానికి ఇవాళ కొండ మీదకు వెడతారని సమాచారం.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత