కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళల పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహించిన మెప్మా ద్వారా పురుషులకు కూడా పొదుపు సంఘాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. చిన్న చిన్న ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకునే పురుషులు గ్రూపులుగా ఏర్పడి పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. వీరు పొదుపు చేసుకునే మొత్తాన్ని ఉపయోగించుకునే వ్యక్తి 12 శాతం వడ్డీ గ్రూపునకు చెల్లించాలి.
సకాలంలో పొదుపు చేసుకుంటూ, అప్పులు చెల్లించిన గ్రూపు సభ్యులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వడంతోపాటు వడ్డీ రాయితీ అందిస్తాయి. గ్రూపు సభ్యులు వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా రాయితీలతో కూడిన రుణాలను కూడా అందిస్తారు.
పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏపీలో ప్రయోగాత్మకంగా పురుషులతో గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలకు అధికారులు రూపొందిస్తున్నారు. త్వరలో ఏపీలో పురుషుల పొదుపు సంఘాలు ఏర్పడబోతున్నాయి.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత