అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు స్పేస్ ఏజన్సీ చరిత్ర సృష్టించింది. కాలిఫోర్నియాకు చెందిన ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ సంస్థ బ్లూ ఘోస్ట్ అనే వ్యోమనౌకను చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ చేసింది. మేం సురక్షితంగా ఉన్నామంటూ చంద్రుడిపై నుంచి సంకేతాలు అందాయి. ఓ ప్రైవేటు సంస్థ చంద్రుడిపైకి వ్యోమనౌకను విజయవంతంగా పంపించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, బ్లూ ఘోస్ట్‌తో కలసి జపాన్ సంస్థ హుకుటో ఆర్2ను నింగిలోకి తీసుకెళ్లింది. దీని పొడవు రెండు మీటర్లు. ఇది జాబిల్లి కక్ష్య నుంచి ఆటోఫైలెట్ మోడ్‌లో ప్రయాణిస్తూ చంద్రుడిపై అడుగుపెట్టింది. ఫోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి జనవరి 15న ప్రయాణం ప్రారంభమైంది.
చంద్రుడిపై ఈశాన్యంలో మోనస్ లాట్రెయిల్ సమీపంలో బ్లూ ఘోస్ట్ దిగింది. దిగిన ఫోటోలను పంపింది. నాసాకు చెందిన పది ప్రయోగాలను బ్లూ ఘోస్ట్ నిర్వహించనుంది. చంద్రుడిపై ఉష్ట్రోగ్రతలు కొలవడం, దూళి సేకరించడం, వ్యోమగాముల దుస్తులకు అంటుకునే దూళిని తొలగించే పరికరాలను పరీక్షించనున్నారు. టెక్సాస్‌కు చెందిన ఇనిస్ట్యూటివ్ మెషీన్స్ సంస్థ ప్రయోగించిన మరో వ్యోమనౌక కూడా మరో నాలుగు రోజుల్లో జాబిల్లిపై అడుగు పెట్టనుంది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత