ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో మరో అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. జేసీ గ్రాఫిక్స్ పేరుతో ప్రభుత్వ పుస్తకాల పంపిణీ టెండరు పొందిన కడప జిల్లాకు చెందిన దినకర్ భారీ అవినీతికి పాల్పడినట్లు విద్యా శాఖ గుర్తించింది. గత ఐదేళ్లుగా ప్రభుత్వానికి పుస్తకాలు పంపిణీ చేస్తూ సర్వ శిక్షా అభియాన్ ద్వారా వందల కోట్ల నిధులను దారి మళ్లించినట్లు గుర్తించారు. గత ప్రభుత్వంలో వైఎస్ అవినాశ్ ఆశీస్సులతో నిబంధనలకు విరుద్దంగా టెండర్లు పొందిన దినకర్, కూటమి ప్రభుత్వంలో కూడా చక్రతిప్పడం విశేషం.
ఏపీ ట్రేడ్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థ ద్వారా పుస్తకాల ప్రింటింగ్, పంపిణీ జరగాల్సి ఉన్నా ప్రైవేటు సంస్థలకు అప్పగించిన కోట్ల రూపాయల కమిషన్ దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. టెండర్లలో చిన్న, మధ్య స్థాయి వారిని దరిచేరనీయకుండా ఒకే టెండరు వేసి ప్రభుత్వ నిధులు కొల్లగొట్టారంటూ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత