సీఐడి మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 నుంచి 2024 మధ్య కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశీ పర్యటనలు చేసిన వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారించిన రెవెన్యూ కార్యదర్శి సిసోడియా ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును హింసించిన కేసులో సునీల్ కుమార్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును హింసించిన కేసులో ఐపీఎస్ సునీల్ కుమార్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాయి. కేసు విచారణలో ఇప్పటికే మాజీ ఐపీఎస్ విజయ్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో సునీల్ కుమార్‌ను త్వరలో విచారణకు పిచిచే అవకాశముందని తెలుస్తోంది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత