14వ సారి టాస్ ఓడిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ -2025లో భాగంగా గ్రూప్ -ఎ చివరి మ్యాచ్ లో భారత్,న్యూజీలాండ్ తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన కివీస్ , ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే కెరియర్ లో 300వ మ్యాచ్ ఆడుతున్నాడు. భారత్ తరఫున ఇప్పటివరకు ఆరుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు.
భారత జట్టు : రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హర్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజీలాండ్ జట్టు :రచిన్ రవీంద్ర, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచైల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచైల్ శాంటర్న్, మాట్ హెర్నీ, కేల్ జేమీసన్,విలియమ్ ఓరూర్కీ
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత