కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి టీటీడీ చైర్మన్ లేఖ
తిరుమల క్షేత్రంపై విమానాల రాకపోకలను నిషేధించాలని తిరుమల తిరుపతి దేవస్థానం కోరుతోంది. ఇప్పటికే ఈ విషయమై అనేకసార్లు కేంద్ర విమానయాన శాఖకు విన్నవించింది. ప్రస్తుతం కేంద్రం, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంతో మరోసారి కేంద్రవిమానయాన శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది.
ఆగమశాస్త్రం నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రతతో పాటు భక్తుల మనోభావాలు దృష్ట్యా తిరుమలను ‘నో ఫ్లైయింగ్ జోన్’ గా ప్రకటించాలని కోరింది. తిరుమల సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటంలో ‘నోఫ్లై జోన్’ ప్రకటన ముఖ్యమైన అడుగు అవుతుందని ప్రస్తావించింది.
తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నిషేధించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు లేఖ రాశారు.
తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని లేఖలో వివరించారు.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత