రాష్ట్రపతి భవన్ లో లక్కబొమ్మల స్టాల్
ఆహ్వానం పంపిన కేంద్రప్రభుత్వం
ఈ నెల 6 నుంచి 9 వరకు హస్తకళా ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ లోని ఏటికొప్పాక హస్తకళాకారుల ప్రతిభను మరోసారి కేంద్రప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగే వి.ఎ.ఎం-2 లో స్టాల్ ఏర్పాటు చేయాలని ఏటికొప్పాక కళాకారులను కోరింది. లక్కబొమ్మలు తయారు చేసే కళాకారుడు పెదపాటి సత్యనారాయణ శరత్‌కు ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఆహ్వానం పంపింది.
రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేయనున్న హస్తకళా ప్రదర్శనలో శరత్ తయారుచేసిన లక్కబొమ్మలు ప్రదర్శనకు అనుమతించారు. రాష్ట్రపతి భవన్‌లో తొలిసారి లక్కబొమ్మల స్టాల్ ఏర్పాటు చేయనున్నారు.
గతంలో రాష్ట్రస్థాయి అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు అవార్డులు పొందినట్లు తెలిపిన సత్యానారాయణ శరత్, రాష్ట్రపతి భవన్‌లో స్టాల్ ఏర్పాటు చేసే అవకాశం రావడం కళాకారులకి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించిన ఏటికొప్పాక శకటం హైలెట్ గా నిలిచింది. చేతివృత్తులు, వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచింది. ఈ శకటానికి కేంద్రప్రభుత్వం జ్యూరీ అవార్డు సైతం ప్రకటించింది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత