మహిళా న్యాయవాదిపై యాసిడ్ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ కోర్టు సముదాయంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
మొరాదాబాద్ కోర్టుకు శశిబాల అనే న్యాయవాది వచ్చారు. అక్కడే మాటు వేసిన నితిన్ కుమార్, సచిన్ కుమార్ అనే ఇద్దరు దుండగులు మాటు వేసి న్యాయవాదిపై మండే లక్షణాలు కలిగిన యాసిడ్ పోశారు. ఆమె దుస్తులు కాలిపోయాయి. శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
దాడి చేసిన వారికి సంబంధించిన ఫుటేజీని సీసీటీవీ ద్వారా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడికి దిగిన వారు ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళా న్యాయవాదిపై యాసిడ్ దాడి ఘటన యూపీలో కలకలం రేపింది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత