గత వానాకాలం సీజన్లో ధాన్యం దిగుబడిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత యాసంగి లోనూ అదేస్థాయిలో తెలంగాణలో వరి సాగు జరుగుతోంది. తెలంగాణలో అన్ని రకాల పంటల సాగు విస్తీర్ణం 69,22,773 ఎకరాల్లో జరుగుతుండగా అధికభాగం వరిదే కావడం విశేషం.
నీటివనరుల లభ్యత, మేలైన విత్తనాలు, ఇతర సానుకూలత పరిస్థితుల కారణంగా వరి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హరియాణాలను తెలంగాణ అధిగమించింది. యాసంగి లోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్ మినహా అన్ని జిల్లాల్లో వంద శాతం మేర వరి సాగైంది.
యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 47.27 లక్షల ఎకరాలుగా ఉండగా గత ఏడాది 51.92 లక్షల ఎకరాల్లో సాగు జరిగింది. ఈసారి గత ఏడాదికంటే అధికంగా ఫిబ్రవరి నెలాఖరు వరకే 53.24 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మార్చి ఆఖరు వరకు నాట్లకు అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం మరింత పెరుగనుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. .
తెలంగాణ ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో సన్న ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్ ప్రకటించింది. వరి సాగు పెరగడంతో వానాకాలంతో సమానంగా యూరియాకు డిమాండ్ ఏర్పడింది.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత