ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శనివారంతో ముగిసింది. అయితే రంజాన్ పండుగ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. ఇప్పటికే కాల్పుల విరమణ రెండో దశ ఒప్పందంపై ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతోన్న చర్చల్లో పురోగతి కనిపించలేదు. అయితే రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ కొనసాగించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న 94 మంది పౌరుల్లో కొందరిని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌కు అప్పగించారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తాజాగా కాల్పుల విమరణ ఒప్పందం మరికొంత కాలం పొడిగించడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది.
హమాస్ ఉగ్రవాదుల చెరలో ఇంకా 69 మంది బందీలున్నాయి. ఇజ్రాయెల్ వద్ద 1200 మంది ఖైదీలు జైళ్లలో ఉన్నారు. వారిని విడిపించేందుకు ఖతర్, ఈజిప్టు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. మరోసారి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం కుదిరితే మరికొంత మందికి స్వేచ్ఛ లభించే అవకాశం వస్తుంది.