రాష్ట్రంలో బ్లూఫ్లాగ్ గుర్తింపు కలిగిన ఏకైక రుషికొండ బీచ్ ప్రతిష్ఠ మసకబారింది. రుషికొండ బీచ్‌కు బ్లాఫ్లాగ్ గుర్తింపు రద్దు చేస్తూ డెన్మార్మ్ ఎన్విరాన్‌మెంటల్ సంస్థ నిర్ణయం తీసుకుంది. గత కొంత కాలంగా బీచ్ నిర్వహణ అధ్వానంగా మారింది. 2020లో బీచ్ నిర్వహణకు కేంద్రం రూ.7 కోట్లు ఖర్చు చేసింది. దీంతో సదుపాయాలు మెరుగుపడ్డాయి. సదుపాయాలు పరిశీలించిన డెన్మార్క్ సంస్థ 2020లో బ్లూఫ్లాగ్ గుర్తింపును ఇచ్చింది.
గత కొంత కాలంగా బీచ్ నిర్వహణ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. వారు సదుపాయాలు గాలికొదిలేశారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. బీచ్‌లో కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దుస్తులు మార్చుకునే గదుల్లో దుర్గంధం వెలువడుతోంది. రాత్రి అయితే ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దీంతో కొందరు ఫోటోలు తీసి డెన్మార్క్ సంస్థకు పంపించారు. వెంటనే ఆ సంస్థ బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు చేసింది.