సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఛాతిలో నొప్పి రావడంతో రాజంపేట జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు జైలులో స్వల్పంగా ఛాతిలో నొప్పి వచ్చిందని చెప్పడం సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన పోసానిపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. పోసాని చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఏపీలో 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో రైల్వేకోడూరు కోర్టు తీర్పు మేరకు 14 రోజుల రిమాండ్ విధించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఆయనకు ఛాతిలో నొప్పిరావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.