కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని కోరినా స్పందించలేదు. దీంతో మల్లన్నను సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, కులగణన పత్రాలు తగులబెట్టడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించిందన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవన్నారు.