స్థానికతతో పాటు 15 శాతం నాన్ లోకల్ కోటాపై స్పష్టత
ఆలస్యరుసం లేకుండా ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుల స్వీకరణ
జీవో 15 మేరకు ప్రవేశాలు
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే EAPCET దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 4వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, కర్నూలు పరీక్ష కేంద్రాలను రద్దు చేస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
జీఓ 15 మేరకు ఈ సారి15 శాతం నాన్ లోకల్ కోటాలో కూడా ప్రవేశాలు పొందేందుకు ఏపీ విద్యార్థులకు అర్హత లేదు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు కావడంతో ఏపీ విద్యార్థులకు కల్పించే కోటాను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్థానికతతోపాటు 15 శాతం నాన్ లోకల్ కోటాపై స్పష్టత ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీఓ 15 జారీచేసింది.