ఆశావర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి ఉద్యోగ వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచుతూ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 42735 మంది ఆశావర్కర్లు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 37 వేల మంది, పట్టణాల్లో 6 వేల మంది పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ఆశా వర్కర్లకు రూ.10 వేల వేతనం అందుతోంది. ఆశావర్కర్లకు మొదటి రెండు కాన్పులకు 6 నెలలు చొప్పున రెండుసార్లు పూర్తి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ విరమణ తరవాత వారికి రూ.1.5 లక్షల గ్రాట్యుటీ కూడా చెల్లించాలని నిర్ణయించారు.