అమరావతి రాజధాని ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం చేసేందుకు అంబాసిడర్ల నియామకం జరిగింది. తాజాగా మెడికో అంబుల వైష్ణవిని అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ అమరావతి అంబాసిడర్‌గా వ్యవహరించిన అంబుల వైష్ణవి, రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం అందించారు.
అంబుల వైష్ణవి కృష్ణా జిల్లా ముదినేపల్లి వాస్తవ్యులు. ఆమె తండ్రి ప్రముఖ వైద్యులు అంబుల మనోజ్. విజయవాడలో ఎంబీబీఎస్ విద్యానభ్యసిస్తోన్న అంబుల వైష్ణవి అమరావతి రాజధానికి అంబాసిడర్‌గా నియామకం జరగడంపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి రాజధానికి అంబాసిడర్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మెడికో అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్ ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆమెకు సూచించారు.