ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష ప్రారంభం అవ్వగా విద్యార్థులు 8.45లోపు ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళాలి. నేడు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహించారు. ఈనెల 17తో పరీక్షలు ముగియనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 1500 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు వాటిని నో మొబైల్ జోన్ గా ప్రకటించారు. అలాగే భద్రతా చర్యల్లో భాగంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు ప్రతీ 20 పరీక్షా కేంద్రాలకు ఒక ఫ్లైయింగ్ స్కాడ్ ను నియమించారు. 10 లక్షలకు పైగా మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.