మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా ప్రాచుర్యంలోకి వచ్చిన అభయ్‌సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. నొయిడాలో ఓ ప్రైవేటు టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా కొందరు కాషాయ దుస్తులు ధరించి వచ్చిన దుండగులు తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంటర్వ్యూ సమయంలో ఐఐటి బాబా యాంకర్‌పై దాడికి దిగారనే కథనం వినిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
మహాకుంభ మేళాలో మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను బాంబే ఐఐటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు అభయ్‌సింగ్ చెప్పుకొచ్చారు. తరవాత కొంత కాలం ఓ కార్పొరేట్ కంపెనీలో కూడా పనిచేసినట్లు ఆయన ప్రకటించారు. కొన్నాళ్లకు పోటోగ్రఫీపై మక్కువ పెంచుకున్న ఆయన ఆ రంగంలో పనిచేశారు. తరవాత సన్యాసిగా మారి మహాకుంభమేళాలో దర్శనమిచ్చారు. మహాకుంభమేళాలో అభయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఐఐటీ బాంబేలో చదివానని చెప్పడంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆ వీడియో వైరల్ అయింది.