ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ కు చేరింది. లాహోర్ వేదికగా ఆప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్, వర్షం కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయింది. దీంతో ఫలితం తేలకుండానే ఆట ముగిసింది.
టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ జట్టు 50 ఓవర్లలో పదివికెట్ల నష్టపోయి 273 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 12.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. ఆట వర్షంతో నిలిచిపోయే సమయానికి ట్రావిస్ హెడ్( 59), కెప్టెన్ స్టీవ్ స్మిత్( 19) పరుగులతో ఆడుతున్నారు.
మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా, ఆఫ్ఘన్ జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో నాలుగు పాయింట్లు ఉన్న ఆసీస్ సెమీస్ కు చేరింది.
నేడు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో అప్ఘనిస్తాన్ జట్టు సెమీ ఫైనల్ కు చేరే అవకాశం కూడా ఉంటుంది. ఇంగ్లండ్ జట్టు 207 పరుగుల భారీ తేడాతో గెలిస్తే దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో కిందకు పడిపోతుంది. అప్పుడు అప్ఘన్ కు అవకాశం ఉంటుంది. గ్రూప్ బి నుంచి ఇంగ్లండ్ ఇప్పటికే నిష్క్రమించింది. గ్రూప్ ఎలో భాగంగా మార్చి 2న భారత్, కివీస్ మధ్య మ్యాచ్ జరగనుంది.