అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రధాని జెలెన్‌స్కీ మధ్య జరిగిన శాంతి చర్చలు మాటల యుద్ధానికి దారితీసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీరుతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాగ్వాదానికి దారితీశాయి. చర్చలు సజావుగా మొదలైనా కాసేపటికే తీవ్ర గందరగోళానికి దారితీసింది. జెలెన్‌స్కీ తీరు మూడో ప్రపంచ యుద్ధం తీసుకువచ్చేలా ఉదంటూ ట్రంప్ సీరియస్‌గా చెప్పడంతో వివాదం మొదలైంది. ఇరు దేశాల నేతల తీరుతో ఉక్రెయిన్ రాయబారి మార్కరోవా తలపట్టుకున్నారు.
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు ట్రంప్, జెలెన్‌స్కీని వైట్ హౌసుకు ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు శాంతి చర్చలు, యుద్ధం ఆపిన తరవాత ఉక్రెయిన్‌లో విలువైన ఖనిజాలను అమెరికా తవ్వుకునే విషయంలో చర్చలు సాగాల్సి ఉంది. అయితే యుద్ధం ఆపిన తరవాత ఉక్రెయిన్‌కు అమెరికా రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. దీంతో ట్రంప్ సీరియస్ అయ్యారు.
శాంతి చర్చలు విఫలం తరవాత జెలెన్‌స్కీ మీడియాతో మాట్లాడారు. ట్రంప్‌నకు తాను క్షమాపణ చెప్పే ఉద్ధేశం లేదన్నారు. తాను తప్పు చేయలేదని నేను కూడా అధ్యక్షుడిగా చర్చలకు వచ్చానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు తమ వైపే ఉండాలని తాను కోరుకోవడం లేదని, రష్యా పక్షం వహించకుండా మధ్యస్థంగా ఉండాలన్నారు.
కీవ్ ప్రాంతంలో విలువైన ఖనిజాలు తవ్వుకోవాలంటే రష్యా నుంచి రక్షణ కల్పించాలని జెలెన్‌స్కీ కోరారు. ఉక్రెయిన్ డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ వ్యాఖ్యానించారు. మా దేశంలో మేము ఉంటున్నామని ఎవరికీ తల వంచాల్సిన అవసరం లేదని జెలెన్‌స్కీ చెప్పడంతో శాంతి చర్చలకు విఘాతం కలించింది. ఖనిజాల తవ్వకంపై సంతకాలు పెట్టకుండానే జెలెన్‌స్కీ అక్కడ నుంచి వెళ్లిపోయారు.