ఛాంపియన్స్ ట్రోఫీ -2025 గ్రూప్-బి విభాగం match 10 లో భాగంగా నేడు లాహోర్ వేదికగా అప్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 273 పరులుగు చేసింది. ఆసీస్ ముందు 274 లక్ష్యాన్ని ఉంచింది.
అప్ఘనిస్తాన్ ఓపెనర్లు ఆసీస్ బౌలర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడ్డారు. పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్ (22) ఔటయ్యాడు. ఆడమ్ జంపా వేసిన 13.3 ఓవర్‌కు లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో రహమత్‌షా (12) ఔట్ కావడంతో 19 ఓవర్లకు అప్ఘనిస్తాన్ మూడు వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసింది.
సెదిఖుల్లా అటల్ 95 బంతుల్లో 85 పరుగులు చేసి స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో అప్ఘనిస్తాన్ 32 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిదీ (20)ను ఆడమ్ జంపా ఔట్ చేశాడు. 49 బంతుల్లో కేవలం 20 పరుగులు చేసి షాహిదీ వెను,తిరిగాడు. మహమ్మద్ నబీ (1) రన్ ఔట్‌గా వెనుదిరగడంతో ఆరో వికెట్ నష్టపోయింది. గుల్బాదిన్ నైబ్ ను నాథన్ ఎల్లిస్ వెనక్కి పంపాడు.
బెన్ డ్వారషూస్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్(19) వెనుదిరగడంతో 46 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 238కి చేరింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 63 బంతుల్లో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. నూర్ అహ్మద్ (6 )ఆఖరి వికెట్ గా వెనుదిరిగాడు. ఫరూకీ ఖాతా తెరవకుండా క్రీజులో మిగిలిపోాయాడు.
ఆసీస్ బౌలర్లలో డ్వారషూస్ మూడు వికెట్లు తీయగా, జాన్సన్, జంపా చెరో రెండు వికెట్లు , ఎల్లిస్, మ్యాక్స్‌వెల్ చెరొక వికెట్ తీశారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు