బడ్జెట్ సాయం లేకుండానే అమరావతి అభివృద్ధి పనులు
మున్సిపాలిటీల బిల్లుల చెల్లింపు అధికారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి స్థానిక సంస్థలకే అప్పగిస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్రీకృత బిల్లుల చెల్లింపు విధానం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
అమరావతి నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండానే పనులు చేస్తున్నట్లు వివరించారు. అమరావతి ప్రాంతం తనకు తానే ఆర్థిక వనరులు సంపాదించుకుంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన రాజధాని నగరంగా అమరావతి నిలవబోతుందని తెలిపారు. అమరావతి విధ్వంసానికి గత పాలకులు మూడు రాజధానుల ఏర్పాటు చేశారని విమర్శించారు.
మున్సిపాలిటీల బలోపేతానికి బడ్జెట్ లో రూ. 13,862 కోట్లు కేటాయించారు. ఇందుకుగాను మంత్రి పయ్యావుల కు మున్సిపల్ శాఖమంత్రి నారాయణ ధన్యవాదాలు తెలిపారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు