ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రాష్ట్ర బడ్జెట్ 2025 ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సత్యకుమార్ యాదవ్, గత ప్రభుత్వ విధానాలతో ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకునేలా కూటమి ప్రభుత్వ బడ్జెట్ ఉందన్నారు. అన్ని రంగాల వారికీ చేయూత ఇచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు.
ఆరోగ్య వైద్య శాఖ కి బడ్జెట్ లో పెద్ద పీట వేశారన్న మంత్రి సత్యకుమార్, ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనం అన్నారు. ఆరోగ్య శాఖకి 19వేల కోట్ల రూపాయలు కేటాయించడంతో పాటు మూల ధన వ్యయానికి పెద్ద పీట వేశారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే బడ్జెట్ అన్నారు.
కేంద్రం లో మోదీ నాయకత్వం, రాష్ట్రంలో బీజేపీ- జనసేన- టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. తాజా బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. 2047 వికసిత్ భారత్, 2047 విజన్ అంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందన్నారు.
కేంద్రం నిధులు కేటాయించినా గత వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జల జీవన మిషన్ కింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు