ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అప్రమత్తతో 20 మంది జాలర్లు ప్రాణాలతో బయటపడ్డారు.
అరేబియా సముద్రంలోని జాలర్ల పడవలో అగ్నిప్రమాదం జరగగా భారత నావికాదళం తక్షణమే స్పందించి జాలర్లను రక్షించింది. రాయ్‌గఢ్ జిల్లా అక్షి అలీబాగ్ పరిధిలోని సముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మంటలు చెలరేగి బోటు నుంచి పొగ వస్తుండగా స్థానికులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి జాలర్లను క్షేమంగా బయటకు తెచ్చాయి.
బోటు 80 శాతం కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బోటులో మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు