మహారాష్ట్రలోని పుణెలో ఆగి ఉన్న బస్సులో చోటుచేసుకున్న అత్యాచారం ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం ఘటన పుణెలోని స్వర్‌గేట్ ప్రాంతంలో వెలుగు చూసింది. నిందితుడు దత్తేత్రేయ రామ్‌దాస్ అత్యాచారానికి పాల్పడిన తరవాత శ్రీరూర్ చెరకుతోటలో దాక్కున్నాడు.పట్టించిన వారికి లక్ష బహుమతి ప్రకటించడంతో స్థానికులు గుర్తించి సమాచారం అందించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
స్వగ్రామం వెళ్లేందుకు ఓ యువతి పుణె స్వర్‌గేట్ బస్టాండుకు చేరుకుంది. అక్కడే మాటలు కలిపిన దత్తాత్రేయ, అక్కా అంటూ సంభోదించి దగ్గరయ్యాడు. తాను కూడా అటువైపు వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. యువతి అడిగిన ఊరు వెళ్లే బస్సు అటు చివరగా ఉందని, ప్రయాణీలు చాలా మంది బస్సులో ఉన్నారని నిద్రిస్తున్నారని అబద్దం చెప్పాడు. దత్తేత్రేయ మాయమాటలు నమ్మిన యువతి బస్సులోకి వెళ్లగానే డోరు వేసి అత్యాచారం చేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలో లభించిన సీసీటీవీ ఫుటేజీ మేరకు నిందితుడి ఫోటోలను విడుదల చేశారు. నిందితుడు సమీపంలోని చెరకు తోటలో నక్కిఉన్నాడనే సమాచారంతో 15 బృందాలు, స్నిఫర్ డాగ్స్, డ్రోన్లతో గాలింపు చేపట్టి పట్టుకున్నారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు