జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీగా మంచు తీవ్రంగా కురుస్తోంది. కనిష్ఠఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు ప్రతీచోట మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రహదారులను అధికారులు మూసివేశారు.
ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్‌లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో మంచు చరియలు విరిగిపడటంతో 55 మందికి పైగా కార్మికులు చిక్కుకుపోయారు. చమోలి-బద్రినాథ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సహాయకబృందాలు 10 మందిని రక్షించాయి.మిగతా వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది పనిచేస్తున్నారు.
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి పై ఉదంపూర్ వద్ద రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లెహ్, స్పితి సహా పలు ప్రాంతాల్లో నిరంతరంగా మంచు వర్షం కురుస్తోంది. పలు నివాసాలు మంచులో కూరుకుపోయాయి.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు