క్యూలైన్ తో పనిలేకుండా మొబైల్ పేమెంట్
3 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించిన రైల్వే శాఖ
రైల్వే స్టేషన్లలో జనరల్ టికెట్ల రద్దీ నివారణపై ఆ శాఖ దృష్టిపెట్టింది. పెద్ద పెద్ద క్యూలైన్లు, హడావుడిని తగ్గించేందుకు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ లను ఏర్పాటు చేసి విజయవంతంగా సేవలు అందిస్తోంది. అయితే ఈ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేసేందుకు యాప్ ను తీసుకొచ్చింది. అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టం (యూటీఎస్) యాప్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటూ రైల్వే శాఖ తెలిపింది.
2016 లోనే ఈ యాప్ ను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ వినియోగాన్ని పెంచేందుకు 3 శాతం క్యాష్ బ్యాక్ ప్రకటించింది. జనరల్ టికెట్లను మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఈ సేవను అందుబాటులోకి తెచ్చారు. అన్ని స్టేషన్లను కవర్ చేసేలా అభివృద్ధి చేశారు.
జనరల్, ప్లాట్ ఫాం టికెట్లను కూడా ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఆర్-వాలెట్, పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, ఇంటర్నెంట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఆర్ వాలెట్ లో రూ.20 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. వాలెట్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లపై 3 శాతం క్యాష్ బ్యాక్ ఉంది.
ప్రయాణ సమయంలో ఇంటి నుంచే జనరల్ టికెట్ కొనుగోలు చేయడానికి యూటీఎస్ యాప్ ఉపయోగపడుతుంది. మొబైల్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒక వేళ యాప్ లేకపోతే టికెట్ కౌంటర్ వద్ద ఉన్న యూటీఎస్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి టికెట్ పేమెంట్ చేయవచ్చు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు