ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీరేటును సంస్థ ట్రస్టీలు ఖరారు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగింది. వడ్డీ రేటులో ఎలాంటి మార్పు చేయకుండానే ట్రస్టీల సమావేశం నిర్ణయం తీసుకుంది.
సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఆర్థిక శాఖ ఆమోదం లభించిన తరవాత నోటిఫై చేస్తారు. 7 కోట్ల చందాదారులకు 8.25 వడ్డీ చెల్లింపులు చేయనున్నారు. సీబీటీ నిర్ణయం తరవాత ఆర్థిక శాఖ ఆమోదం లాంఛనమే.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీరేటు 8.10 శాతంగా నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల తరవాత ఇంత తక్కువ వడ్డీరేటుపై విమర్శలు వచ్చాయి. ఆ తరవాత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటును 8.25కు పెంచారు. అప్పటి నుంచి అదే వడ్డీరేటును కొనసాగిస్తున్నారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు