మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఆయన ఫోన్‌కు పాకిస్థాన్ నెంబరు నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బెదిరింపుల నేపథ్యంలో సీఎం భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇటీవల ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేకు కూడా బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత పెంచారు. ఉప ముఖ్యమంత్రి శిండే వాహనాన్ని పేల్చి వేస్తామంటూ దుండగులు బెదిరింపులకు దిగారు. విచారణ జరిపిన పోలీసులు, ఉత్తుత్తి కాల్‌గా నిర్థరించారు.
తాజాగా సీఎం ఫడణవీస్‌కు పాక్ నుంచి బెదిరింపు సందేశాలు వచ్చాయి. అయితే ఆ సందేశంలో ఏలాంటి విషయాలు ఉన్నాయనే దాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. కేసు విచారణ వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి భద్రత పెంచారు.
మహాకుంభమేళాపై కాంగ్రెస్ అధిష్ఠానం వ్యతిరేకత: ధిక్కరించిన పలువురు నేతలు