వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఆ పార్టీ ముఖ్యనేతలు పలువురు ఇప్పటికే అరెస్ట్ అవ్వగా తాజాగా మరో మాజీ ఎంపీకి సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు అందజేశారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్టు అయ్యారు. తాజాగా వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఓ మహిళతో మాధవ్ అసభ్యకర, అభ్యంతరకర రితీలో వీడియో కాల్ మాట్లాడినట్లు ఓ వీడియో గతంలో బయటకు వచ్చింది. దీనిపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబర్ 2న ఈ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు మాధవ్ ఇంటికి వెళ్ళి నోటీసులు అందజేశారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 72, 79 కింద కేసు నమోదైంది.