శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు రాత్రివేళ తెప్పోత్సవం నిర్వహించారు. ఈ ఆలయ పుష్కరిణిలో ఈ సేవ నిర్వహించారు. తెప్పోత్సవానికి ముందు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు షోడశోపచార పూజ నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ సేవలో పాల్గొంటే శ్రేయస్సు కలగడంతో పాటు శత్రు బాధలు తొలుకుతాయి.ముఖ్యంగా సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండుతాయి.