యాదగిరిగుట్ట పంచనారసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఈ ఏడాదితో 70 ఏళ్ళు పూర్తవుతాయి. కృష్ణశిలతో పునర్‌నిర్మితమైన ఆలయంలో మూడోసారి బ్రహ్మోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఐదంతస్థుల కృష్ణశిల విమానం గోపురం బంగారు కవచాలతో రూపొంది మహాదివ్యంగా దర్శనమిస్తోంది.
ఈ ఏడాది ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1న ప్రారంభమై 11న నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో ముగియనున్నట్లు పండితులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 7న ఎదుర్కోలు మహోత్సవం, 8న తిరు కళ్యాణం, మార్చి 9న దివ్యవిమాన రథోత్సవం జరగనుంది.
యాదగిరిగుట్టలో స్వామివారు. ఉగ్ర, జ్వాల, యోగ, గండబేరుండ, శ్రీలక్ష్మీసమేత నారసింహుడిగా కొలువుదీరారు.