ఆంధ్రప్రదేశ్ పై అప్పుడే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి రెండు లేదా మూడో వారంలోనే రాష్ట్రంపై వడగాలులు ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ తీవ్రత ఏప్రిల్-జూన్ మధ్యలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుంది. వడగాలులపై ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ (imd) హెచ్చరికలు జారీ చేసింది.
కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. విశాఖ, నరసాపురం, మచిలీపట్నం పరిధిలో బుధవారం నాడు సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల పెరుగుదల నమోదైంది. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలకు తేమ వాతావరణం తోడు కావడంతో ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే వాతావరణ కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాతావరణ మార్పుల కారణంగా గడిచిన 30 ఏళ్లలో వడగాలుల వ్యవధి 2.5 రోజులు పెరిగింది. 2015లో విపత్తు మాదిరిగా వడగాలులు విజృంభించగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి.