ప్రయాగ్ రాజ్ కుంభమేళా మహాశివరాత్రితో ముగిసింది. మకర సంక్రాంతి రోజు ప్రారంభమైన కుంభమేళా 45 రోజుల పాటు జరిగింది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల కోసం దాదాపు 66 కోట్ల మంది వచ్చినట్లు తేలింది. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం నాడు 1.44 కోట్ల మందికి పైగా భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ఈ కుంభమేళా ఘనత సాధించింది .
మహా కుంభమేళాను సంప్రదాయం, సాంకేతికత, వాణిజ్యం, ఆధ్యాత్మికతల కలయికగా హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు అభివర్ణించారు. ఈ వేడుక ద్వారా సమాజం ఎన్నో పాఠాలు, అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడిక – మహాకుంభ్ అంతర్గత పాఠాలు’ న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాపేరిట ప్రత్యేక చర్చావేదికను నిర్వహించింది.
ఆఖరి రోజు గంగమ్మ హారతి అందరినీ ఆకట్టుకుంది.