ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్తో జరిగిన మ్చాచ్_ 8లో అఫ్గనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బి విభాగంలో అఫ్గనిస్తాన్ విజయం సాధించి పోటీలో నిలవగా ఇంగ్లాండ్ ఇంటిబాట పట్టింది. లాహోర్ వేదిక గా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో అప్గనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసి ఇంగ్లండ్ ఎదుట 326 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
అప్గనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్జాయ్ (41) నబీ ( 40) పరుగులు చేశారు
ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, లివింగ్ స్టన్ రెండు, జేమీ ఒవెర్టన్ , అదిల్ రషీద్ చెరొక వికెట్ తీశారు.
లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులు చేసి ఆలౌటైంది. వరుసగా రెండో ఓటమితో నాకౌట్ రేసు నుంచి ఇంటి బాటపట్టింది. జో రూట్ (120) రాణించినా ఆ జట్టుకు విజయం దక్కలేదు. బెన్ డకెట్ (38), జోస్ బట్లర్ (38), జేమీ (27) పోరాడారు.
అప్గనిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐదు వికెట్లు తీయగా , మహమ్మద్ నబీ రెండు, రషీద్ ఖాన్, గుల్బాదిన్ నైబ్, ఫజల్ హక్ ఫారూఖి ఒక్కో వికెట్ తీశారు.