మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో శ్రీ స్వామిఅమ్మవార్లకు దివ్యకళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. స్వామివారు తలపై ఒక వైపు గంగమ్మను, మరో వైపు నెలవంకను కలిగి ఉన్నారు. మెడలో రుద్రాక్షలతో పాటు ఆభరణాలు ధరించారు. నుదుట విభూతి రేఖలు, పట్టువస్త్రాలు ధరించి పెండ్లికుమారుడిగా ముస్తాబయ్యారు.
అమ్మవారు నుదుట కళ్యాణ తిలకాన్ని పెట్టుకుని బుగ్గన చుక్కతో పాటు సర్వాభరణాలను ధరించి పట్టుచీరతో స్వామివారికి సరిజోడు అనిపించారు.