మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్
మహా శివరాత్రి వేళ , బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ శివార్చన చేశారు. ఈ మేరకు ఆయన అభిషేకం నిర్వహించే ఫొటోలను సోషల్ మీడియా వేదికగా భక్తులతో పంచుకున్నారు.
హర హర మహాదేవ్ అంటూ క్యాప్షన్ పెట్టారు.
హిందూ కుటుంబానికి చెందిన బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్టన్ దాస్ , సనాతన ధర్మాన్ని ఆచరిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగ నేడు శివాలయానికి వెళ్లి అక్కడ ఉన్న శివలింగాలకు అభిషేకం నిర్వహంచారు.
బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వంలో హిందువులపై అనేక దాడులు జరిగాయి. లిట్టన్ దాస్ ఇంటిని కూడా అల్లరిమూకలు ధ్వంసం చేశాయి. అయినా సరే లిట్టన్ దాస్ ఏమాత్రం భయపడకుండా ఆలయానికి వెళ్ళి శివాభిషేకం చేశాడు.
దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ కూడా శివరాత్రి సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు.