సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి ఓ యుద్ధ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే నివాసాలపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 46 మంది సైనికులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
విమాన ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాద కారణాలపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. సూడాన్‌పై పట్టుకోసం పారామిలటరీ దళాలు, సైన్యం మధ్య పోరు జరుగుతోంది. ఇది తీవ్ర రూపం దాల్చింది. న్యాలా ప్రాంతంలో ఓ సైనిక విమానాన్ని కూల్చి వేసినట్లు డార్ఫర్ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న ఆర్‌ఎస్‌ఎఫ్ ప్రకటించింది. ప్రస్తుత ప్రమాదానికి అంతర్యుద్దానికి సంబంధం ఉందా? లేదా అనే విషయం తేలాల్సి ఉంది.