పండగ పూట విషాదం చోటుచేసుకుంది. పుణ్య స్నానాలకు వెళ్ళి ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో జరిగింది.
మహాశివరాత్రి కావడంతో తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు. నది లోతు గుర్తించకపోవడంతో ఐదుగురు నీటిలో చనిపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. పవన్ (17), దుర్గాప్రసాద్ (19), పవన్ (19), ఆకాశ్ (19), సాయి కృష్ణ (19) గల్లంతైనవారిలో ఉన్నారు. వీరంతా ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు.