ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా గ్రూప్ -బి విభాగంలో దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా వేయకుండానే అర్ధాంతరంగా రద్దు అయింది. రావల్పిండిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేసింది. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
మొదట్లో వాన తగ్గుముఖం పట్టేలా కనిపించడంతో 20 ఓవర్ల చొప్పున ఆడించేందుకు ప్రయత్నించారు.కానీ సాధ్యపడలేదు.
గ్రూప్ బి లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ ఇంకా ఖాతా తెరవలేదు. ఈ మ్యాచ్ రద్దు కారణంగా ఈ గ్రూపులో ఉన్న నాలుగు జట్లకు సెమీ ఫైనల్స్ అవకాశాలు ఉన్నాయి.