పాకిస్తాన్ సైన్యంపై బలోచిస్తాన్ తిరుగుబాటుదారులు మరో దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఏడుగురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు, 11మంది గాయపడ్డారు.
పాకిస్తాన్ సైన్యం రక్షణలో 29 ట్రక్కుల కాన్వాయ్ క్వెట్టా-కరాచీ జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. ఆ వాహన శ్రేణి మీద బలోచ్ రెబెల్స్ దాడి చేసారు. పాక్ సైనికులపై బాంబుల వర్షం కురిపించారు. ఆ దాడిలో ఏడుగురు సైనికులు చనిపోయారు.
పాకిస్తాన్ సైనికులు ఆ వాహన శ్రేణిలో రాగి లోహాన్ని తీసుకువెడుతున్నారు. బలోచిస్తాన్‌లోని సైందక్ ప్రాజెక్ట్ ప్రాంతం నుంచి కరాచీకి వారు వెడుతుండగా బలోచ్ రెబెల్స్ దాడికి పాల్పడ్డారు. రాగి తీసుకువెడుతున్న వాహనాలకు రక్షణగా ఉన్న సైనిక వాహనం మీద రిమోట్ కంట్రోల్ సాయంతో ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) పేల్చారు. ఆ వెంటనే గ్రెనేడ్ లాంచర్లు, మెషీన్ గన్లతో కాల్పులు జరిపారు. ఆ దాటిలో ఏడు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఆ దాడికి పాల్పడింది తామేనంటూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. బలోచిస్తాన్‌లోని వనరులను ఒక చైనీస్ కంపెనీ తీసుకువెళ్ళిపోతోందని తెలియజేసింది. తమ ప్రాంతపు వనరులను దోచుకోడానికి ప్రయత్నించే విదేశీ కంపెనీలు వేటికైనా అదే గతి పడుతుందని హెచ్చరించింది. బలోచిస్తాన్ ప్రజల హక్కు అయిన సహజ వనరులను సైందక్, రెకోదిక్ వంటి మైనింగ్ ప్రాజెక్టులు దోచుకుపోతున్నాయని బలోచ్ లిబరేషన్ ఆర్మీ మండిపడింది.
మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా