లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. జనాభాను అదుపు చేయడంలో తమిళనాడు విజయం సాధించిందని, జనాభా ప్రాతిపదిక లోక్‌సభ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తే తమిళనాడులో 39 సీట్లు, 31కి తగ్గాతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హిందీని తమిళనాడుపై రుద్దాలని చూస్తున్నారని స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఇదే జరిగితే మరో భాషా యుద్ధానికి తాము సిద్దమేనని సవాల్ విసిరారు. కేంద్ర విద్యా విధానంలో భాగంగా మూడు భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే హిందీపై తమిళనేతలు మొదటి నుంచి వ్యతిరేకత కనబరుస్తున్నారు. భాషల మధ్య విభేదాలు లేవని ఒకదానితో ఒకటి పెనువేసుకుపోయాయని, కొందరు కావాలని భాషా యుద్ధాలకు పిలుపునిస్తున్నారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తమిళనాడుతో పెట్టుకోవద్దంటూ స్టాలిన్ చేసిన హెచ్చరికలు వైరల్ అయ్యాయి. హిందీని ఎవరిపై రుద్దే ఆలోచన కేంద్రానికి లేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు తేల్చి చెప్పారు.
మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా