దిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా నిర్ధారణ అయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు కోర్టు శిక్ష ఖరారు చేసింది. సజ్జన్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.
దిల్లీ సరస్వతీ విహార్ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌ను హతమార్చారన్న కేసులో ఆయన దోషిగా తేలారు. దీంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది. సిక్కు అల్లర్లకు సంబంధించిన మరో కేసులో ఇప్పటికే సజ్జన్ తిహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. సజ్జన్ పై మరో రెండు కేసులు ఉండగా అవి కోర్టు విచారణ దశలో ఉన్నాయి.
1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లలో సజ్జన్ కుమార్ కేవలం భాగస్వామి కాదని, అతడు ఒక బృందానికి నాయకత్వం వహించినట్లు కోర్టు తేల్చింది.
ఈ కేసును విచారించిన దిల్లీ రౌస్ అవెన్యూస్ కోర్టు, ఫిబ్రవరి 12న వాదనలు ముగించింది. సజ్జన్ ను దోషిగా తేల్చి , నేడు శిక్ష ఖరారు చేసింది.
మండలిలో మంత్రి లోకేశ్ మాజీ మంత్రి బొత్స వాగ్వాదం : ఇంగ్లీషు వీరికి అర్థం కావడం లేదంటూ లోకేశ్ ఎద్దేవా