బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైంది. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కోల్ కతా, భువనేశ్వర్ లోనూ ప్రకంపనలు వచ్చాయని వివరించింది.
ఫిబ్రవరి 17న ఉదయం దిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి ప్రకంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే బిహార్ లో ప్రకంపనలు వచ్చాయి.