గ్రూప్ A నాకౌట్ బెర్తులు ఖరారు
సోమవారం జరిగిన మ్యాచ్ 6లో బంగ్లాదేశ్ పై కివీస్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజీలాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది.
లక్ష్యఛేదనలో న్యూజీలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసి విజయం సాధించింది. న్యూజీలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర శతకం కొట్టాడు. 105 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి 112 పరుగులు చేశాడు. టామ్ లాథమ్( 55), డెవాన్ కాన్వే (30), గ్లెన్ ఫిలిప్స్ (21నాటౌట్ ) పరుగులు చేశారు.
బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, నహీద్ రాణా, ముస్తాఫిజూర్ రెహ్మాన్, రిషాద్ హసన్ తలా ఒక వికెట్ తీశారు.
పాకిస్తాన్ పై తొలి మ్యాచ్ నెగ్గిన కివీస్, తాజాగా బంగ్లాదేశ్ పై నెగ్గి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ తో పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగనుంది. గ్రూప్-ఏలో భాగంగా ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఆ జట్టు ఓడింది. ఈ నెల 27న బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడనుంది. అందులో గెలిచినా సెమీస్ కు వెళ్ళడం కష్టమే.
ఆడిన రెండు మ్చాచుల్లోనూ విజయాలతో న్యూజీలాండ్, భారత్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్ స్థానం ఖరారు చేసుకున్నాయి. ఈ రెండు జట్లు మార్చి 2న తలపడనున్నాయి.