శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్లకు పుష్పపల్లికీ సేవ నిర్వహించారు. స్వామివారు వ్యాఘ్రచర్మం రూపంలోని వస్త్రాలు, ఆభరణాలు ధరించి, త్రిశూలం, ఢమరుకం చేతబూని దర్శనమిచ్చారు.కుడి చేతిలో పుష్పంతో ఆసీనులయ్యారు.
ఆదిదంపతుల పుష్పపల్లికీ సేవ దర్శిస్తే భక్తుల కోరికలు నెరవేరడంతో పాటు ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం.
వివిధ రకాల బంతిపూలు, చామమంతి, కనకంబరాలు, డచ్ రోస్ అశోక పత్రాల మాలలు, నందివర్ధనం, గరుడ వర్ధనం, కాగడాలు, అస్సెర్ గ్రాస్, గ్లాడియేలస్ పుష్పాలతో ఆదిదంపతులను అలంకరించారు.
నేడు బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లకు నందివాహనసేవ నిర్వహించనున్నారు.