అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వై.కోటకు శివరాత్రి మొక్కులు తీర్చుకోవడానికి నడచి వెళుతోన్న భక్తులపై ఏడు ఏనుగులు దాడి చేశాయి.ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద చోటుచేసుకుంది. మృతులు దినేశ్, మణెమ్మ, చెంగల్ రాయుడుగా గుర్తించారు.
ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. మృతుల కుటుంబాలకు పదిలక్షల పరిహారం ప్రకటించారు. వెంటనే బాధితులను ఆదుకోవాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ను ఆదేశించారు.
ఇటీవల కాలంలో ఉమ్మడి చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏనుగులను తరిమివేసేందుకు ఇప్పటికే కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించారు. పంటపొలాలపై విరుచుకుపడుతోన్న ఏనుగులను అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులను ఉపయోగిస్తున్నారు.
రోహిత్ శర్మను బాడీ షేమింగ్ చేసిన కాంగ్రెస్ నేత