ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాలని అక్కడ శాంతి నెలకొనేలా చూడాలంటూ సోమవారంనాడు ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలను ఉపసంహరించుకోవాలంటూ ఐరాసలో పెట్టిన తీర్మానానికి మద్దతుగా 93 దేశాలు, వ్యతిరేకంగా 18 దేశాలు ఓటింగులో పాల్గొన్నాయి. భారత్ సహా 65 దేశాలు తటస్థంగా ఉన్నాయి.
యుద్ధం ముగించడానికి కుదిరే ఒప్పందంలో భాగంగా ఐరాస శాంతి పరిరక్షకులను ఉక్రెయిన్‌లో రష్యా అనుమతిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. తీర్మానంలో రష్యా దురాక్రమణ అనే విషయం లేకుండా చూడాలని అమెరికా చేసిన ప్రయత్నాన్ని ఐరాస కొట్టివేసింది. బందీల విడుదల, ఇంధన సరఫరా అంశాలపై ఐరాసలో చర్చ జరిగింది. ఐరోపాతో అమెరికా సత్సంబంధాలు కలిగి ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, అమెరికా అధక్షుడు ట్రంప్‌కు సూచించారు. సోమవారం వారిద్ధరు భేటీ అయ్యారు.