శ్రీశైల క్షేత్రంలో దుకాణాలను ముస్లిములు నిర్వహిస్తుండడంపై చాలాకాలం నుంచీ హిందువులు డిమాండ్ చేస్తున్నారు. పరమశివుడి పవిత్రక్షేత్రంలో అన్య మతస్తులకు దుకాణాలు కేటాయించకూడదంటూ విశ్వ హిందూ పరిషత్ చాలా కాలం నుంచీ డిమాండ్ చేస్తోంది. న్యాయపోరాటం కూడా చేస్తున్నది. అయినా ప్రభుత్వాల్లో స్పందన లేదు.
అలాంటి తరుణంలో తాజాగా జరిగిన గొడవ మరోసారి ముస్లిం వ్యాపారుల ఆగడాలను, హిందూ వ్యతిరేక ప్రవర్తననూ వెలుగులోకి తీసుకొచ్చింది. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు అమ్మే దుకాణాల్లో ఒకదాన్ని ముర్తజా వలీ అనే ముస్లిం వ్యక్తి నిర్వహిస్తున్నాడు. దర్శనానికి వెళ్ళిన ఒక శివమాల ధరించిన హిందూ భక్తుడు ఆ దుకాణానికి వెళ్ళాడు. అక్కడ ధరల విషయంలో మాటామాటా పెరిగింది. దాంతో ముర్తజా వలీ, శివమాల వేసుకున్న హిందూ భక్తుడిపై దాడి చేసాడు.
మాలలో ఉన్న భక్తుడిపై శివాలయం లోపలే ముస్లిం వ్యక్తి దాడి చేయడం ఆలయం ఆవరణలో ఉన్న భక్తులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. వారంతా ఆ దుకాణం దగ్గరకు వెళ్ళి అతన్ని నిలదీసారు. దాంతో విషయం పెద్దదయింది. వాగ్వాదం కాస్తా రగడగా మారింది. ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే దేవాలయానికి చేరుకున్నారు. ముస్లిం దుకాణదారుడు ముర్తజా వలీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దేవాలయాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల్లో నుంచి అన్యమతస్తులను తక్షణమే తొలగించాలని హిందూసమాజం డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా శ్రీశైలంలో అన్యమతస్తులకు దుకాణాలు కేటాయించే పద్ధతిని విరమించుకోవాలని కోరుతోంది. లేనిపక్షంలో హిందువుల ఆగ్రహానికి లోనుకావలసి ఉంటుందని హెచ్చరిస్తోంది. హిందువులు గతంలోలా అమాయకంగా లేరనీ, వారిలోనూ చైతన్యం పెరుగుతోందనీ ప్రభుత్వం గ్రహించాలి. అన్య మతస్తులు సైతం లౌకిక భావజాలంతో హిందువులను గౌరవిస్తూ వారి ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని హిందువులు కోరుకుంటున్నారు.